- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. బావిలో పడి రైతు కూలీ మృతి
దిశ, ధర్మవరం రూరల్: మండల పరిధిలోని కట్ట కింద పల్లి గ్రామం వద్ద శుక్రవారం ఉదయం దాసరి రామాంజనేయులు(43) అనే వ్యవసాయ కూలీ మరమ్మత్తు కోసం బావిలో దిగి ఊపిరాడక నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు.. కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన దాసరి రామాంజనేయులుతో పాటు పలువురు కూలీలు కూలి పని నిమిత్తం ధర్మవరం మండలం కట్ట కింద పల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలోకి వచ్చారు. బావిలో పుష్కలంగా నీరు ఉండడంతో అడుగు భాగాన పాడైపోయిన మోటర్కు తాడు కట్టేందుకు నీళ్లలో మునిగాడు. అయితే బావిలో ముళ్ళ పొదలు ఎక్కువగా ఉండటంతో వాటిని తగులుకొని ,బయటకు రాలేక ఊపిరాడక బావిలోనే మృతి చెందాడు.
ఈ విషయాన్ని తోటి కూలీలు గ్రామస్తులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై శ్రీనివాసులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారి సహకారంతో బావిలో ఉన్న నీటిని తోడే ప్రయత్నం చేసి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సాయంత్రం వరకు ఫైర్ ఇంజన్ తో నీటిని తోడినా కూడా శవం లభ్యం కాలేదు. శవం కోసం అటు పోలీసులు, ఇటు ఫైర్ సిబ్బంది కూడా శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. బావి పై భాగంలో చెరువు ఉండడంతో బావిలోని నీరును ఎంత తోడినా కూడా తగ్గలేదు. ఈ విషయం తెలుసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మంత్రి సత్య కుమార్ పిఏ హరీష్ బాబు, సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన సంఘటన గురించి ఆరా తీశారు. మృతునికి భార్య ,ఇద్దరు కుమారులు ఉన్నారు.