- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురుగుల మందు తాగిన రైతు.. సెల్ఫీ వీడియో వైరల్..
దిశ, పరిగి: అప్పుల బాధతో ఓ రైతు పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసి గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో షేర్ చేశాడు. ఈ సంఘటన పరిగి మండలం పోల్కంపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోతర్ల శంకర్ (39), విజయలక్ష్మీ భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. శంకరయ్యకు ఎకరం పొలం ఉంది. కాగా శంకరయ్య తన పొలంతో పాటు ఇతరుల పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవలే నూతనంగా ఇళ్లు నిర్మించాడు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణానికి, పంట పెట్టుబడులకు చేసిన అప్పు ప్రైవేటు వ్యక్తులతో, బ్యాంకుల్లో మొత్తం దాదాపు రూ. 18 లక్షల వరకు అయింది.
అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో కొన్ని రోజులుగా శంకర్ మనోవేదనకు గురవుతున్నాడు. అప్పులు తీర్చే మార్గం లేదని భావించిన శంకర్ బుధవారం పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ తరువాత గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. వెంటనే గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే శంకర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.