- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య..
దిశ, భిక్కనూరు : అనారోగ్య సమస్యలతో అప్పుల పాలై, చేసిన అప్పులు తీర్చేదెట్లా అన్న మానసిక వేదన గురై ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భిక్కనూరు మండలం భాగిర్తి పల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకివెళితే గ్రామానికి చెందిన పెద్దోళ్ల లక్ష్మణ్ (40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన భార్య వెంకటమ్మ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగేవాడు. ఎంతకీ ఆరోగ్యం కుదుటపడకపోవడం, చేసిన అప్పులు తీర్చే దారి లేక తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉరివేసుకునే ముందు ఇంటికి ఫోన్ చేసి భార్యకు జాగ్రత్త అని చెప్పి, ఫోన్ కట్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కూతురు స్రవంతి, కుమారుడు శ్రవణ్ ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై ఆనంద్ గౌడ్ వివరించారు.