అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య

by Sumithra |
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య
X

దిశ, లక్షెట్టిపేట : అప్పుల బాధ భరించలేక మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట పురపాలక సంఘం పరిధిలోని గంపలపల్లికి చెందిన రాగుల శంకరయ్య (54) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయాన్ని గమనించి కుటుంబ సభ్యతుల చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కుటుంబసభ్యుల తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ఈ యేడు తనకున్న రెండు ఎకరాలతో పాటు మరో ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి, పత్తి పంటలను సాగు చేస్తున్నాడు.

గత ఎనిమిదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా.. ఆశించిన దిగుబడులు లేక అప్పులు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో సుమారు రూ. 8 లక్షల మేరకు అప్పులు పెరిగిపోయాయి. ఆ అప్పుల బాధ భరించలేక ఈ నెల 14న పొలం వద్ద పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు లక్షెట్టిపేట ఎస్సై చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story