భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న డాక్టర్.. పిల్లల ముందే..

by Satheesh |   ( Updated:2023-05-20 03:04:03.0  )
భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న డాక్టర్.. పిల్లల ముందే..
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడలో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్యను హత్య చేసి చేసిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ తాను అదే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఇద్దరు పిల్లల ముందే డాక్టర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులను నాగరాజు, సుజాతగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నాగరాజు భార్యను హత్య చేసి అతడు ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. తండ్రి నాగరాజు చేసిన పనికి ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలిపోయారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story