హత్యను..ఆత్మహత్యగా చిత్రీకరించి.. నిందితులను తప్పించేందుకు రూ.6 లక్షల డీల్

by Aamani |
హత్యను..ఆత్మహత్యగా చిత్రీకరించి.. నిందితులను తప్పించేందుకు రూ.6 లక్షల డీల్
X

దిశ,నాగార్జునసాగర్ : నల్గొండ గుర్రంపోడు మండలం ముల్కల పల్లి గ్రామంలో ఆగస్టు 29న ఓ మహిళని హత్య చేసి,నలుగురు దుండగులు హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించారు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం రిపోర్ట్ లో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టు రిపోర్ట్ ఇవ్వాలని డాక్టర్ ను ఎస్సై నారాయణరెడ్డి కోరాడు. మెడికల్ రిపోర్టు రాకముందే తనంతట తానే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టు IPC సెక్షన్ (306) కింద ఎఫ్ఐఆర్ చేశాడు. ఇది ఇలా ఉండగా ఈ హత్యలో నలుగురు పాల్గొంటే ముగ్గురిని పక్కకు తప్పించరాని మృతురాలి భర్త ఆరోపణ. అయితే ఆ ముగ్గురు నిందితులను తప్పించేందుకు రూ. 6 లక్షల రూపాయలు డిల్ కుదిరించుకొని కానిస్టేబుల్ సత్యనారాయణ ద్వారా అడ్వాన్స్ గా రూ. నాలుగు లక్షల రూపాయలు ఎస్సై కి అందినట్లు సమాచారం.

పోలీస్ స్టేషన్ లో నేరం ఒప్పుకున్న నిందితుడు రాములు హత్యకు గురైన మహిళ కుటుంబ సభ్యులకు రూ. 30 లక్షలు ఇచ్చేటట్టు గ్రామ పెద్దలు ఖరారు చేశారు.రూ. 30 లక్షలు ఇస్తాడో ఇవ్వడో అని ముందస్తుగా నిందితుడు రాములు దగ్గర నుండి ఎకరం భూమిని గ్రామ పెద్దమనుషుల సమక్షంలో గోగు బిక్షం రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. హత్యకు గురైన మహిళ కుటుంబసభ్యులకు 6 నెలల్లో రూ.30 లక్షలు నిందితుడు రాములు ఇచ్చేస్తే ఎకరం భూమి తిరిగి రిజిస్ట్రేషన్ రాములు పేరు మీద చేసేటట్లు గ్రామ పెద్దలు ఒప్పందం చేశారు.

Next Story

Most Viewed