రూమర్స్ కు చెక్ పెట్టిన మాజీ విశ్వ సుందరి

by M.Rajitha |   ( Updated:2024-09-23 11:31:07.0  )
రూమర్స్ కు చెక్ పెట్టిన మాజీ విశ్వ సుందరి
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొంతకాలంగా విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్(Aishwarya Rai). సోషల్ మీడియాలో, పలు వార్తా చానెల్స్ లో ఐశ్వర్యా రాయ్-అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) విడాకులు తీసుకుంటున్నారంటూబ్ కొంత కాలంగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటన్నింటినీ పెద్దగా పట్టించుకోనట్లే కనిపించే ఐష్.. సమయం వచ్చినపుడు మాత్రం ఆ రూమర్స్ కు తెరదించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి వదంతులకు మరోసారి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది ఈ నీలికళ్ల సుందరి. అంగరంగ వైభవంగా జరుగుతున్న 'పారిస్ ఫ్యాషన్ వీక్'(Paris Fasion Week) కు హాజరైన ఐశ్వర్యా.. తన చేతికి వెడ్డింగ్ రింగ్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అది వివాహ సమయంలో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యకు తొడిగారు. ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విడాకుల రూమర్స్ మీద ఎలాంటి కామెంట్స్ చేయకుండానే తెలివిగా చెక్ పెట్టిందని బాలీవుడ్ మీడియా పేర్కొంది.

Advertisement

Next Story