- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కోలీవుడ్ కంటే తెలుగు ఇండస్ట్రీ బెటర్.. జానీ మాస్టర్ కేసుపై చిన్మయి ఆసక్తికర పోస్ట్

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మైనర్ అయిన తన అసిస్టెంట్‌పై నాలుగేళ్లుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోర్ట్ రిమాండ్ విధించింది. అయితే ఆయన మాత్రం తప్పు చేయలేదని అంటున్నారు.
అయినప్పటికీ విషయం తెలుసుకుని ఫిల్మ్ ఛాంబర్ సస్పెండ్ చేసింది. తాజాగా, దీనిపై సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్ట్ అవుతూ వరుస పోస్టులు షేర్ చేసింది. ‘‘నా రికార్డింగ్ సమయంలో వైరమత్తును పిలవద్దు అని చెప్పా. ఎందుకంటే అతను వచ్చి ఫ్లర్ట్ చేసేవాడు కాబట్టి. అందుకే పాట పాడటం పూర్తైన తర్వాత పిలవమని చెప్పేదాన్ని. తమిళ ఇండస్ట్రీలో రాజకీయాలకు చెందిన వారు ఈ వ్యక్తిని రక్షించారు. కోలీవుడ్‌లో ఎప్పుడూ లైంగిక వేధింపుల సమస్య ఉంటుంది. ఈ విషయంలో తమిళం కంటే తెలుగు చిత్ర పరిశ్రమ అద్భుతంగా ఉంది. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో ప్రాణాలతో బయటపడిన వారికి సహాయం చేసే విధానం బాగుంది’’ అని రాసుకొచ్చింది.