- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA : మహిళలను లక్షాధికారులను చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
దిశ, కొత్తకోట: మహిళలను లక్షాధికారులను చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని, వారిని అన్ని రకాలుగా ఆదుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం కొత్తకోట మున్సిపాలి కేంద్రంలోని బిపిఆర్ గార్డెన్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ లో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా రూ. 500 కే గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు, అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ… మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రూ. 500 కే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాన్ని అందజేస్తున్నామని అన్నారు. గత పాలకులు 2014 నుంచి రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే మన ప్రభుత్వం నెలకు రూ. 5000 కోట్లకు పైగా మిత్తిలు కడుతున్నామని చెప్పారు.
రాష్ట్రంలో మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారని, రూ. 250 కోట్లు మహిళల కోసం ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. వచ్చే నెలలో ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ కార్డు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు దసరా పండుగ రెండు నుంచి పార్టీలకు అతీతంగా ఇవ్వబోతున్నామని చెప్పారు. కానాయపల్లి గ్రామ ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో ఇద్దరు మంత్రులు రాబోతున్నారని అన్నారు. మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మన సహాయ సహకారాలు అందించాలని కోరారు. నేను లాయర్ గా ఎన్నో కోట్ల సంపాదన ఉన్న అన్ని వదులుకొని ప్రజాసేవ చేయడానికి మీ ముందుకు వచ్చానని నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన కొత్తకోట మండల ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లె పాగ ప్రశాంత్, మున్సిపల్ చైర్మన్ సుకేశిని విశ్వేశ్వర్, వైస్ చైర్మన్ జయమ్మ, కౌన్సిలర్లు పద్మ అయ్యన్న, రామ్మోహన్ రెడ్డి, మిషేక్, మండల పార్టీ అధ్యక్షులు బీచుపల్లి, ప్రధాన కార్యదర్శులు బోయేజ్, కృష్ణారెడ్డి,పట్టణ అధ్యక్షులు మేస్త్రి శీను, కిసాన్ సెల్ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సాక బాల నారాయణ,ఎండి లతీఫ్, సలీం ఖాన్, సంద వెంకటేష్, సుజ్ఞానం నవీన్, అమ్మపల్లి బాలకృష్ణ,జే కే రాజు, క్రాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు.