హైదరాబాద్ కు మరోసారి భారీవర్షం.. వాతావరణశాఖ హెచ్చరికలు

by M.Rajitha |
హైదరాబాద్ కు మరోసారి భారీవర్షం.. వాతావరణశాఖ హెచ్చరికలు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలో నేడు మరోసారి భారీవర్షం కురవనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత రెండు రోజుల మాదిరిగానే సోమవారం కూడా సాయంత్రం పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురవనున్నట్లు తెలిపింది. సాయంత్రం 7 గంటల నుండి అర్థరాత్రి వరకు అనేక చోట్ల భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాలని జీహెచ్ఎంసీ(GHMC) సూచనలు చేసింది. అయితే మధ్యాహ్నం నుండే నగరంలో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన భారీవర్షం కురుస్తోంది. మియాపూర్, నిజాంపేట్, లింగంపల్లి,టోలిచౌకీ, షేక్ పేట్, మెహెదిపట్నం, అసిఫ్ నగర్, కూకట్ పల్లి, మాదాపూర్, కొండాపూర్, రాజేంద్రనగర్ లో వర్షం కురిసింది. కాగా బంజారాహిల్స్, మాదాపూర్, చాంద్రాయణగుట్ట, కోఠి, సైదాబాద్, చంపాపేట, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, మల్లాపూర్, తార్నాక, నాచారం, ఓయూ క్యాంపస్ తదితర ప్రాంతాల్లో ఈపాటికే కుండపోత వర్షం మొదలైంది.

Next Story

Most Viewed