మూసీలో మృతదేహం కలకలం

by Sridhar Babu |
మూసీలో మృతదేహం కలకలం
X

దిశ,ఉప్పల్ : మూసీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. ఈ ఘటన స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మధు తెలిపిన వివరాల ప్రకారం కేటీఆర్ కాలనీ వద్ద మూసీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురై పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మూసీలో నుంచి బయటకు తీశారు. వ్యక్తి వయస్సు సుమారు 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటుండని, వంటిపై దుస్తులు లేవని, బనియన్ మాత్రమే ఉందని తెలిపారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. లేదా 8712662161, 8712662697 నంబర్లకు చెప్పాలని ఎస్ఐ మధు తెలిపారు.

Advertisement

Next Story