పెళ్లైన మూడు నెలలకే మృత్యు ఒడిలోకి వెళ్లిన జంట.!

by Sumithra |   ( Updated:2023-06-09 12:44:03.0  )
పెళ్లైన మూడు నెలలకే మృత్యు ఒడిలోకి వెళ్లిన జంట.!
X

దిశ, మరిపెడ : విధిఆడిన వింత నాటకంలో కొత్తగా పెళ్లై మూడు ముళ్ళు పడి మూడు నెలలు నిండకుండానే ఓ జంట మృత్యు ఒడిలోకి వెళ్ళింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంబించిన విధి వెక్కిరించడంతో ఘోర రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ విషాద దుర్గటన మరిపెడ మండలం తానంచర్ల శివారులో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణానికి చెందిన గుగునాద్ గోపి - సునీతల కుమార్తె అంజలిని భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తెల్లగరిగా గ్రామానికి చెందిన తుంగర నారాయణకి ఇచ్చి 09-03-2023 న వివాహం జరిపించారు.

ఇతను హైదరాబాద్ లో సాఫ్ట్ వెర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అంజలి బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు వస్తున్న క్రమంలో శనివారం మరిపెడ మండలం తానంచర్ల గ్రామ శివారు కోరుకొండ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విరిద్దరూ మరణించారు. సరిగ్గా మూడు నెలల్లోనే విరి జీవితం ముగిసిపోయింది. మూడు నెలలకే మీ ముక్కుపచ్చని కాపురం ముగిసిందా అంటూ గ్రామస్తుల, బంధువుల రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకొని ధర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story