- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీసీ బస్సులో ఉరేసుకొని కండక్టర్ ఆత్మహత్య
దిశ, వరంగల్ బ్యూరో : ఓ కండక్టర్ ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి ఆదివారం ఉదయం 10 గంటలకు డ్యూటీ ఉందని 11 గంటల ప్రాంతంలో డిపోకు చేరుకున్నాడు. సెక్యూరిటీ కార్యాలయం రిజిస్ట్రార్‌లో సంతకం పెట్టి డిపోలోకి వెళ్లాడు. వెళ్లి చాలా సమయమైన తిరిగిరాకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి చూడగా బస్సులో ఉరివేసుకుని ఉన్నాడు.
ఈ ఘటన మధ్యాహ్నం వెలుగులోకి రాగా డిపో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. మహేందర్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అనే విషయం తెలియరాలేదు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడ్డడా..? వ్యక్తిగత కారణాలతోనా? ఇంకేమైనా కారణాలున్నాయన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.