కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-04 11:22:47.0  )
కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదైంది. కోటం రెడ్డిపై కార్పొరేటర్ విజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కోటంరెడ్డిపై కేసు నమోదు చేశారు. కోటంరెడ్డి తనను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని కార్పొరేటర్ ఆరోపించారు. డివిజన్ ఆఫీసులో ఫెక్సీలు తొలగించినందుకు తనను ఎమ్మెల్యే బెదిరించాడని కార్పొరేటర్ తెలిపారు. కోటంరెడ్డిపై 448, 363 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా వైసీపీ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి గత కొన్ని రోజులుగా జగన్ సర్కారు తన ఫోన్ ట్యాప్ చేస్తుందని ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed