చెరువులోకి దూసుకెళ్లిన కారు..ఒకరి మృతి

by Aamani |
చెరువులోకి దూసుకెళ్లిన కారు..ఒకరి మృతి
X

దిశ, నర్సంపేట: అదుపుతప్పిన కారు చెరువులోకి దూసుకెళ్లడంతో ఓ యువకుడు మృతి చెందాడు.ఈ ఘటన నర్సంపేట మండలం మదన్నపేటలో చెరువు దగ్గర చోటు చేసుకుంది. నర్సింహులపేట కు చెందిన ముగ్గురు యువకులు మాదన్నపేట గ్రామానికి శుభకార్యానికి కారులో వచ్చారు. తిరిగి వెళ్తున్న క్రమంలో కారు మత్తడి వద్ద చెరువులోకి దూసుకెళ్లిన నట్లు తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్న యువకుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story