- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోడంగల్లో పశువైద్య కళాశాల భవన నిర్మాణానికి ఒప్పందం
దిశ, తెలంగాణ బ్యూరో : పీవీ. నరసింహరావు పశు వైద్య విశ్వవిద్యాలయ పరిధిలో కోడంగల్ లో కొత్తగా ఏర్పాటవుతున్న పశు వైద్య కళాశాల భవనాల నిర్మాణానికి విశ్వవిద్యాలయం, రోడ్లు భవనాల శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. బుధవారం ఈ మేరకు తెలంగాణా సచివాలయంలో ఆర్అండ్ బి శాఖ, పశువైద్య శాఖాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పరస్పరం ఇందుకు సంబంధించిన ఎంఓయును మార్చుకున్నారు. ఈ కొత్త పశు వైద్య కళాశాల ప్రాంగణంలో ప్రధాన భవనం, పశు వైద్యశాల, బాలికల, బాలుర వసతి గృహం , ఇతర భవనాలు నిర్మించనున్నారు. మొత్తం 38 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 171 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవనాలు నిర్మించనున్నట్ల పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , విశ్వవిద్యాలయ ఉప కులపతి. సబ్యసాచి ఘోష్ తెలియ జేశారు. ఈ పశు వైద్య కళాశాల ఏర్పాటు ద్వారా కోడంగల్ ప్రాంతంలో పశుగణాభివృద్ధి జరిగి, రైతుల ఆర్థిక అభివృద్ధికి ప్రాంతీయ అభివృద్ధికి సహకరించనున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్. శరత్ చంద్ర, ఎస్టేట్ ఆఫీసర్ ప్రొఫెసర్. చిన్ని ప్రీతం, రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ (భవనాలు) . బీ. రాజేశ్వర్ రెడ్డి , ఎస్ఈ వసంత నాయక్ పాల్గొన్నారు. ఈ కళాశాల ఏర్పాటుతో ప్రాంతీయ అభివృద్ధికి, వ్యవసాయానికి పశు వ్యవసాయ రంగానికి కీలకమైన సహకారం అందే అవకాశాలు ఉన్నాయని సబ్యసాచి ఘోష్ వెల్లడించారు.