నడిరోడ్డుపై కారు దగ్ధం

by Shiva |
నడిరోడ్డుపై కారు దగ్ధం
X

అధిక ఉష్ణోగ్రతల వల్లే ఇంజన్ లో నుంచి మంటలు

దిశ, కోరుట్ల టౌన్ : అకస్మాత్తుగా మంటలు చెలరేగి నడిరోడ్డుపై కారు దగ్ధమైన ఘటన కోరుట్ల పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళి.. జగిత్యాల మండలం చల్గాల్ గ్రామానికి చెందిన సుర బక్కన్న కోరుట్ల నుంచి తన కారులో వస్తుండగా, కోరుట్ల పాలిటెక్నిక్ కళాశాల వద్దకు రాగానే కారు ఇంజన్ లోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధిక ఉష్ణోగ్రతల వల్లే ఇంజన్ లోంచి మంటలు ఒక్కసారిగా రావొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని కోరుట్ల ఎస్సై సతీష్ కుమార్ పరిశీలించారు.

Advertisement

Next Story