డబ్బుకోసం స్నేహితుని దారుణ హత్య..

by Sumithra |
డబ్బుకోసం స్నేహితుని దారుణ హత్య..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ ; స్నేహితుడికి అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగిన అభాగ్యుడు హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల శివార్లలో కనగోళ్ళు వెంకట్ దారుణహత్యకు గురయ్యాడు. మోర్తాడ్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు కనగోళ్ళు వెంకట్ అనే వ్యక్తిని మోర్తాడ్ గ్రామానికి చెందిన తనస్నేహితుడు గోనురి శేఖర్ అలియాస్ జల్సా శేఖర్ దారుణంగా హత్య చేశాడని ఎస్సై సీహెచ్ ముత్యం రాజు తెలిపారు.

వివరాల్లోకి వెళితే కనగోళ్ళు వెంకట్ అనే వ్యక్తి దగ్గర గోనురి శేఖర్ అలియాస్ జల్సాశేఖర్ కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని వెంకట్ కోరగా పథకం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి సమయంలో డబ్బులు తిరిగి ఇస్తానని నమ్మబలికి ఊరి శివారులలో తీసుకెళ్లి కత్తితో పొడిచి దారుణంగా హత్యచేసి పరారయ్యాడని ఎస్సై తెలిపారు. కేసు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story