Illegal Affair: 48 ఏళ్ల ఆంటీతో 18 ఏళ్ల యువకుడి ఎఫైర్.. గమనించిన కూతురిపై అమానుషం

by Mahesh |   ( Updated:2022-08-25 06:56:11.0  )
Illegal Affair: 48 ఏళ్ల ఆంటీతో 18 ఏళ్ల యువకుడి ఎఫైర్.. గమనించిన కూతురిపై అమానుషం
X

దిశ, వెబ్‌డెస్క్: 48 ఏళ్ల మహిళతో 18 ఏళ్ల యువకుడు సంబంధం పెట్టుకుని అడ్డొచ్చిన 17 ఏళ్ల బాలికను హత్య చేశాడు. ఈ సంఘటన ఢిల్లీలోని తిక్రీ బోర్డర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హరీష్(18) అనే వ్యక్తి బహదూర్‌గడ్‌లోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ.. బాధితురాలు కుటుంబంతో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలోనే నిందితుడు హరీష్(18) బాధితురాలి తల్లితో సంబంధం పెట్టుకున్నాడు. ఇది గమనించిన కుతురు హరీష్‌ను హెచ్చరించింది.

దీంతో బాలికను అంతమొందించాలని నిర్ణయించుకున్న నిందితుడు.. తిక్రీ బోర్డర్ ఏరియాలోని లేఖ్ రామ్ పార్క్ వద్ద బాలిక గొంతు కోశాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాదితురాలిని ఆసుపత్రి తరలించగా.. అప్పటికే చనిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఫెయిలైన పుష్ప ప్లాన్‌.. రూ.4 కోట్లు ఇచ్చిన తృప్తి చెందలే!

Advertisement

Next Story