తాళం వేసిన ఇండ్లే టార్గెట్..

by Sumithra |
తాళం వేసిన ఇండ్లే టార్గెట్..
X

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన దుంపల బాలరాజ్ గత ఆరు నెలల నుండి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులో జీవనం కొనసాగిస్తున్నాడు. అప్పుడప్పుడు తన స్వగ్రామానికి వచ్చిపోతూ ఉండేవాడు. ఆ విధంగానే ఈ నెల 5వ తేదీన దేవునిపల్లి వచ్చి హైదరాబాద్ తిరిగు పయణం అయ్యారు.

మంగళవారం ఉదయం తన ఇంటి పక్కన ఉండే వ్యక్తి ఫోన్ చేసి ఇంటి తలుపులకు ఉన్న తాళం పగలగొట్టి ఉన్నదని సమాచారం ఇవ్వగా బాలరాజు వెంటనే దేవునిపల్లికి వచ్చి ఇంటిని పరిశీలించారు. ఇంట్లోని బీరువా తలుపులు పగలగొట్టి సుమారు 80 తులాల వెండి ఆభరణాలు దొంగిలించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed