యూపీలో వడదెబ్బకు 34 మంది మృతి

by Javid Pasha |
యూపీలో వడదెబ్బకు 34 మంది మృతి
X

బల్లియా (యూపీ) : జూన్‌ నెల వచ్చినా ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి తాపం తగ్గడం లేదు. ఈనేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని బలియాలో ఎండవేడిమి, వడగాలులకు 34 మంది మృతిచెందారు. వడదెబ్బకు జిల్లా దవాఖానలో చేరి గత 24 గంటల్లో 34 మంది మృతిచెందినట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది 60 ఏండ్లకు పైబడిన వారేనని తెలిపారు. గురువారం రోజు ఉదయం 23 మంది మృతిచెందగా.. శుక్రవారం రోజు ఉదయం మరో 11 మంది మృత్యువాతపడ్డారని బలియా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ జయంత్‌ కుమార్‌ తెలిపారు.

"చనిపోయిన వారందరూ గతంలోనే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. వీరంతా తీవ్ర ఎండలను తట్టుకోలేక మృతి చెందారు. మృతుల్లో ఎక్కువమంది గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌, డయేరియా కారణంగానే చనిపోయారు" అని ఆయన వెల్లడించారు. భారత వాతావరణ శాఖ సమాచారం మేరకు శుక్రవారం రోజు బలియాలో 42.2 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. దీంతో రాష్ట్రంలో విద్యుత్‌ కోతల వల్ల మంచినీరు లేక, ఫ్యాన్లు, ఎయిర్‌ కండీషన్లు లేక జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ విద్యుత్‌ కోతలకు నిరసనగా పలువురు నిరసనలు కూడా చేపట్టారు.

Advertisement

Next Story