ఘోర విషాదం.. బంగారు గనిలో మంటలు చెలరేగి 27 మంది మృతి

by Mahesh |
ఘోర విషాదం.. బంగారు గనిలో మంటలు చెలరేగి 27 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారు గనిలో మంటలు చెలరేగి 27 మంది మృతి చెందిన విషాద సంఘటన దక్షిణ పెరూలో చోటు చేసుకుంది. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు నిర్ధారించారు. కాగా ఈ ప్రమాదంలో మొత్తం 27 మంది కార్మికులు మృతి చెందగా మరో 175 మందిని సురక్షితంగా బయటపడినట్లు యానాకిహువా మైనింగ్ కంపెనీ తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story