- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పక్షిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః ఒక ప్రాణం కాపాడటానికి మరో రెండు ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదకరమైన సంఘటన. ఇది ముంబైలోని బాంద్రా వర్లీ సీ లింక్ రహదారిపైన జరిగింది. హైవే పైన గాయాలతో పడిపోయిన పక్షిని కాపాడే ప్రయత్నంలో అతివేగంగా వచ్చిన క్యాబ్ ఢీకొట్టడంతో 43 ఏళ్ల వ్యాపారవేత్త అమర్ మనీష్ జరీవాలా, అతని డ్రైవర్ శ్యామ్ సుందర్ కామత్ మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ సీసీటీవీ ఫుటేజీలు ఇంటర్నెట్‌లో షేర్ చేయగా వైరల్ అయ్యింది. మీడియా కథనాల ప్రకారం, ఈ ప్రమాదం జరిగినప్పుడు జరీవాలా బాంద్రా-వర్లీ సముద్ర లింక్ రహదారిపై మలాడ్‌కు వెళుతున్నారు. అకస్మాత్తుగా, ఒక పక్షి ఎగురుకుంటూ వచ్చి కారును ఢీకొట్టింది. జరీవాలా తన డ్రైవర్ కామత్‌ను ఆపివేయమని ఆదేశించాడు. గాయపడిన పక్షిని కాపాడేందుకు వాళ్లిద్దరూ రద్దీగా ఉండే సీ లింక్ రోడ్డుపైకి దిగారు.
పక్షిని కాపాడే క్రమంలో, డ్రైవర్ కామత్ కారును ఓ మూలన ఆపి, గాయపడిన పక్షిని తన యజమాని జారివాలాకి చూపించాడు. పక్షిని పరిశీలిస్తుండగా అదే మార్గంలో వేగంగా వచ్చిన క్యాబ్ వారిపైకి దూసుకెళ్లింది. ఆ హిట్ ఎంత పవర్ ఫుల్ గా ఉందంటే, ఇద్దరూ గాలిలోకి ఎగిరి, కింద పడ్డారు. ఇద్దరినీ నగరంలోని లీలావతి ఆసుపత్రికి తరలించగా, అక్కడ జరీవాలా మృతి చెందాడు. ఆ తర్వాత, ప్రాణాలతో పోరాడిన డ్రైవర్ కామాత్ కొద్దిరోజుల తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందాడు. వేగంగా వచ్చిన క్యాబ్ డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఇద్దరు మృతి చెందారన్న ఆరోపణలతో రవీంద్రకుమార్ జైస్వర్ (38)పై ర్యాష్, బాధ్యతా రహితంగా డ్రైవింగ్ చేశాడని కేసు నమోదైంది. నిందితుణ్ని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. బాంద్రా-వర్లీ సీ కనెక్షన్‌పైన పోల్ నంబర్ 76 వద్ద ప్రమాదం జరిగిందని దర్యాప్తు అధికారి పిఎస్‌ఐ కిరణ్ జాదవ్ తెలిపారు. ఢీకొన్న సమాచారం అందుకున్న పోలీసు బృందం వెంటనే రంగంలోకి దిగి ఘటనాస్థలికి చేరుకున్నట్లు పేర్కొన్నారు.