150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత..

by Sumithra |
150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత..
X

దిశ, కూసుమంచి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని మల్లేపల్లిలో లారీ, బొలెరో వాహనాల్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 300 బస్తాలు (సుమారు 150 క్వింటాళ్ల) రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం తెల్లవారుజామున పట్టుకున్నారు. పేదలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో తక్కువ రేటుకు కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ముందస్తు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి లారీ, బొలెరో వాహనంలో రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 150 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకొని కూసుమంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కూసుమంచి ఎస్ఐ నాగరాజు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed