గంజాయి కేసులో 11మంది యువకులు అరెస్ట్

by Aamani |
గంజాయి కేసులో 11మంది యువకులు అరెస్ట్
X

దిశ,సత్తుపల్లి: సత్తుపల్లిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన సంఘటన మేడిశేట్టు వారి పాలెం లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్ మంగళవారం విలేకరుల సమావేశంలో కల్లూరు ఏసీపీ ఏ. రఘు, సత్తుపల్లి పట్టణ సీఐ టీ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం, సత్తుపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన 11 మంది యువకులు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ఉన్న ఆవుల పాక గ్రామానికి చెందిన భగవాన్ దగ్గర నుంచి కొనుగోలు చేసి సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం సాధారణ వాహనాల తనిఖీలో భాగంగా సత్తుపల్లి మండల లోని మేడిశెట్టి వారి పాలెం శివారులో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. స్విఫ్ట్ డిజైర్ కార్ లో గంజాయి తరలిస్తున్న 1.పాశం వెంకట శివరామకృష్ణ, .2. కొమ్ము గోవర్ధన్,.3. ఆరుమళ్ల తరుణ్ కుమార్, 4.వేల్పుల పుల్లారావు, పట్టుబడగా వారి వద్ద నుంచి 5 కేజీల 845 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

కేసు విచారణ చేస్తుండగా 6. నున్నా నవీన్, 7. వెలిశాల వినయ్,8. కొత్తపల్లి రత్న బాబు, 9. కువ్వారపు నితిన్ కుమార్, 10. రామా ల కార్తీక్, 11. పాలకుర్తి రాజేష్ లు,11. మంది వ్యక్తులు సత్తుపల్లి పరిసర ప్రాంతాలలో పలుసార్లు గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించి వారి వద్ద నుంచి షిఫ్ట్ డిజైర్ కారు, 2 టూ వీలర్స్ మోటార్ సైకిల్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ప్రభుత్వం వైద్య పరీక్షల అనంతరం సత్తుపల్లి కోర్టులో హాజరు పరిచినట్లు కల్లూరు ఏసీపీ ఏ రఘు తెలిపారు. సత్తుపల్లి లో గంజాయి కేసులో పలుసార్లు ముద్దాయిగా తేలితే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని, ఈ గంజాయి కేసు ను చాకచక్యంగా చేధించిన స్థానిక పోలీసులకు జిల్లా ఎస్పీ అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో వేంసూర్ ఎస్సై మేడా ప్రసాద్, సత్తుపల్లి ఎస్ఐ ప్రతాప్, హెడ్ కానిస్టేబుల్ చెన్నారావు, కానిస్టేబుల్ నరేష్, శ్రీనివాసరావు, కోటా సుధాకర్ పలువురు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story