కబాబ్ నచ్చలేదని వంట మనిషిని..

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-05 03:42:47.0  )
కబాబ్ నచ్చలేదని వంట మనిషిని..
X

దిశ, వెబ్‌డెస్క్: కబాబ్ టేస్ట్ గా లేదని ఇద్దరు వ్యక్తులు వంట మనిషిని కాల్చిన దారుణ ఘటన యూపీలోని బరేలీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరేలీలోని ప్రేమ్ నగర్ లోని ప్రేమ్ నగర్ లో ఉన్న ఓ కబాబ్ దుకాణానికి కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అల్కహాల్ తాగిన వారు కబాబ్ రుచిగా లేదని యజమానితో గొడవకు దిగారు. ఈ క్రమంలో బిల్లు చెల్లించకుండా కారు వద్దకు వెళ్లారు. వారి దగ్గర రూ.120 వసూలు చేయాలని ఓనర్ వంట మనిషిని ఆదేశించాడు. దీంతో వంట మనిషి నసీర్ వారి వద్దకు వెళ్లి డబ్బులు అడిగాడు. కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి వంట మనిషి నసీర్ కణతపై తుపాకీ తో కాల్చాడు. దీంతో నసీర్ అక్కడిక్కడే కుప్పకూలాడు. నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

Advertisement

Next Story