హైదరాబాద్‌లో మరో విషాదం

by Anukaran |
హైదరాబాద్‌లో మరో విషాదం
X

దిశ, వెబ్ డెస్క్: నగరంలోని ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన కొడుకును హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్బీనగర్ లోని శాతవాహన కాలనీలో ఓ మహిళ తన కొడుకును హత్య చేసి, ఆ తర్వాత భవనంపై నుంచి దూకి తాను ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story