కొడుకు చనిపోయాడని పెద్దమ్మ మృతి

by Anukaran |
కొడుకు చనిపోయాడని పెద్దమ్మ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: బంధాలు, బంధుత్వాలు, సంప్రదాయాలు, ఇతర పలు విషయాల్లో చెప్పుకోదగ్గ దేశంగా మన దేశానికి పేరుంది. ఇప్పటి నుంచే కాదు.. ఆనాటి నుంచి మన దేశంలో సంస్కృతి, సంప్రదాయాలు ఆ విధంగా గొప్పగా విరాజిల్లుతూ వస్తున్నాయి. అయితే వాటి వెనుక ఎన్నో ఉన్నత విషయాలు, ప్రేమానురాగాలు ఉన్నాయి. అందుకే అవి మన దేశంలో ఎవర్ గ్రీన్ గా నిలుస్తాయి. మన దేశ ఔన్నత్యం ఎలాంటిదో.. అక్కడ గౌరవభావాలు, ప్రేమానురాగాలు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. కానీ, కొందరు వ్యక్తులు వాటిని కాలరాస్తూ ఆనాటి నుంచి వస్తున్న ఈ గౌరవ సూత్రాలను మంటగలుపుతున్నారు. భూములు, ఆస్తులు కోసం ఉన్నవారిని వదలుకుంటున్నారు. కొందరైతే వారిని కడతేర్చుతున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలోని చింతలపాలెం మండలం మరాఠీపురంలో దారుణం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం చినబాబు అలియాస్ బల్లీ అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ విషయం తెలిసి చినబాబు పెద్దమ్మ కూడా గుండెపోటుతో మృతిచెందింది. భూ వివాదం కారణంగానే తమ చినబాబును కొంతమంది వ్యక్తులు కొట్టిచంపారని బంధువులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ ఎంపీటీసీతో సహా 30 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, 40 ఏళ్లుగా 560 ఎకరాల భూమికి సంబంధించి రెండు కులాల మధ్య వివాదం కొనతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story