- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న మరో క్రికెటర్..
దిశ,వెబ్ డెస్క్: గతేడాది కరోనా సమయంలో చాలామంది సెలెబ్రెటీలు పెళ్లి చేసుకొని ఒక ఇంటివారయ్యారు. ఈ మధ్యనే టీమిండియా పేస్ సంచలనం జాస్ప్రిత్ బుమ్రా కూడా తాను ప్రేమించిన సంజనను వివాహమాడి ఒక ఇంటివాడయ్యాడు. ఇక తాజాగా మరో క్రికెటర్ పెళ్లి పీటలెక్కనున్నాడు. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా త్వరలో పెళ్లి కొడుకు కానున్నాడు. ఈ కారణంగానే అతను ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడే తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి అయిన హేటి లి ని జంపా వివాహమాడనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసన్ ధృవీకరించారు. “జీవితంలో వివాహం చాలా ప్రధానమైనదని, అందుకే జంపా నిర్ణయాన్ని గౌరవిస్తునట్లు” తెలిపారు. ఇకపోతే ఐపీఎల్ కోసం మార్చి 29 నుంచి ఆర్సీబీ తమ ట్రైనింగ్ క్యాంప్‌ను ప్రారంభించబోతోంది.