- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శ్రీలంకతో సఫారీల సిరీస్ వాయిదా..
by Shyam |
X
కరోనా వైరస్ ప్రభావంతో మరో క్రికెట్ సిరీస్ వాయిదా పడింది. రోజులు గడుస్తున్నా వైరస్ నియంత్రణలోకి రాకపోవడంతో తమ శ్రీలంక పర్యటనను వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా ప్రకటించింది. ఈ మేరకు బోర్డు ఒక మీడియా నోట్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం దక్షిణాఫ్రికా జట్టు జూన్‌లో శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడాల్సి ఉంది. కానీ, పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే ఉండటంతో సిరీస్ వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. ఇప్పటికే భారత్‌తో సిరీస్ అర్థాంతరంగా రద్దు కాగా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండి ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్లిపోయారు. కరోనా ప్రభావం తగ్గేంత వరకు ఎలాంటి క్రికెట్ ఆడబోమని సఫారీ బోర్డు స్పష్టం చేసింది.
Tags : South Africa, Srilanka, Corona, Cricket series, Postponed
Advertisement
Next Story