బ్రేకింగ్.. క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ.1.25 కోట్ల నగదు సీజ్.?

by Sumithra |
బ్రేకింగ్.. క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ.1.25 కోట్ల నగదు సీజ్.?
X

దిశ, హ‌న్మకొండ టౌన్ : హన్మకొండ జిల్లా గోపాలపురంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. బెట్టింగ్‌ ముఠా నుంచి దాదాపు రూ. 1. 25 కోట్ల న‌గ‌దు పట్టుబడినట్లు సమాచారం. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. అయితే, గ‌త కొద్దిరోజులుగా వ‌రంగ‌ల్ క్రికెట్ బెట్టింగ్‌కు అడ్డాగా మారింద‌న్న నిఘా వ‌ర్గాల స‌మాచారంతో పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేర‌కు వ‌రుస‌గా త‌నిఖీలు నిర్వహిస్తూ వ‌స్తోంది. ఇప్పటికే ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేయ‌గా.. తాజాగా గోపాల‌పురంలో మ‌రో పెద్ద ముఠా ప‌ట్టుబ‌డ‌టం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story