- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్ట్రేలియాలో రెండు సిరీస్‌లు వాయిదా
దిశ, స్పోర్ట్స్ : కరోనా నేపథ్యంలో మరో రెండు సిరీస్‌లను ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఆఫ్గానిస్తాన్‌తో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు న్యూజీలాండ్‌తో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఈ సీజన్‌కు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మూడు క్రికెట్ బోర్డులు తాజాగా సమవేశమై ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
‘ప్రస్తుత సమ్మర్ సీజన్ ఇండియా పర్యటనతో ప్రారంభం కానున్నది. టీమ్ ఇండియా పర్యటన కారణంగా మిగిలిన రెండు సిరీస్‌లకు సమయం లేకుండా పోయింది. దీంతో వాటిని వచ్చే సీజన్‌కు వాయిదా వేశాము’ అని సీఏ తాత్కాలిక సీఈవో నిక్ హోక్లే ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభంలో పడిన క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇండియా పర్యటన ద్వారా నిధులు సమకూరే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇతర జట్లను ఆహ్వానించి డబ్బులు ఖర్చు చేసినా తిరిగి ఆదాయం వచ్చే అవకాశం లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.