- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒలింపిక్స్‌లో క్రికెట్.. మీకు తెలుసా !
ప్రపంచంలోని అన్ని క్రీడలను కలిపి ఒకే చోట నిర్వహించే మెగా ఈవెంట్ ఒలింపిక్స్. ఈ మెగా ఈవెంట్‌లో క్రికెట్‌ను కూడా చేర్చాలని చాలా ఏండ్లుగా ప్రతిపాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ చాలా సమయం తీసుకునే ఈ ఆటను ఒలింపిక్స్‌లో చేర్చడానికి ఐవోసీ ఒప్పుకోవడం లేదు. కాగా, టీ20 రూపంలో ధనాధన్ క్రికెట్ వెలుగులోకి వచ్చిన తర్వాత, కనీసం ఈ ఫార్మాటైనా ఒలింపిక్స్‌లో చేర్చాలనే ఒత్తిడి ఎక్కువైంది. అయితే చాలా మంది క్రికెట్ ప్రేమికులకు తెలియని విషయం ఏంటంటే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎప్పుడో ప్రవేశపెట్టారు.
1900 సంవత్సరంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో నిర్వహించిన ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా ఉంది. మే 14 నుంచి అక్టోబర్ 28 వరకు సుదీర్ఘంగా జరిగిన ఈ సమ్మర్ ఒలింపిక్స్‌లో రెండు రోజుల పాటు క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.
గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్ జట్లు ఆ ఒలింపిక్స్‌లో క్రికెట్ బెర్తులు పొందాయి. కానీ, చివరి నిమిషంలో బెల్జియం, నెదర్లాండ్స్ జట్లు తప్పుకోవడంతో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య ఒకే ఒక మ్యాచ్ ఆడించి విజేతను నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో బ్రిటన్ విజయం సాధించి బంగారు పతకం గెలుచుకోగా.. ఓడిపోయిన ఫ్రాన్స్ జట్టు వెండి పతకంతో సరిపెట్టుకుంది. అయితే ఈ రెండు జట్లు కూడా ఆయా దేశాల జాతీయ జట్లు కాకపోవడం గమనార్హం. బ్రిటన్ లోని డేవన్ అండ్ సోమర్ సెట్ వాండరర్స్ అనే క్లబ్ జట్టు బ్రిటన్ తరపున, ఫ్రెంచ్ అథ్లెటిక్ క్లబ్ యూనియన్ జట్టు ఫ్రాన్స్ తరపున ఒలింపిక్స్‌లో తలపడ్డాయి. కాగా ఫ్రాన్స్ జట్టులోని క్రీడాకారులందరూ బ్రిటన్ నుంచి వలస వచ్చి ప్యారిస్‌లో స్థిరపడ్డ వాళ్లే కావడం గమనార్హం.
Tags : Olympics, Cricket, T20, France, Great Britain, Paris, Somerset