- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జవాన్ల ప్రాణాల కంటే క్రికెట్ ముఖ్యం కాదు :గంభీర్
న్యూఢిల్లీ: మన జవాన్ల ప్రాణాల కంటే క్రికెట్ ఎంత మాత్రమూ ముఖ్యం కాదని టీమ్ ఇండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తెలిపారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపేంతవరకు ఇరు దేశాల మధ్య క్రికెట్ సహా ఎలాంటి సంబంధాలూ ఉండకూడదని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాల గురించి ఓ జాతీయ మీడియా గంభీర్‌ను అడగ్గా, ‘క్రికెట్ చాలా చిన్న విషయం. మన జవాన్ల ప్రాణాలు ఎంతో విలువైనవి. కావునా, సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపేంతవరకు పాక్‌తో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోకూడదు’ అని బదులిచ్చాడు.
గురువారం భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ గురించి అడగ్గా, పర్యాటక జట్టు వాళ్ల బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే, పిచ్‌పై కామెంట్ చేయదలచుకోలేదని, అది ఐసీసీకి సంబంధించిన విషయమని వెల్లడించాడు. కాగా, భారత్, పాకిస్తాన్‌ల దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో ఇరు దేశాల మధ్య ఏళ్లుగా క్రికెట్ మ్యాచ్‌లు జరగని విషయం తెలిసిందే. ఐసీపీ నిర్వహించే వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో మినహా ఎక్కడా ఈ రెండు జట్లు తలపడట్లేదు. ఇరు దేశాలు చివరిగా 2019లో నిర్వహించిన వన్డే వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.