- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వమే భరించాలి..
దిశ ప్రతినిధి, మెదక్: పార్టీ పిలుపులో భాగంగా మంగళవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు మాట్లాడుతూ .. గత మూడు నెలల నుంచి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు కరోనా వ్యాధికి ప్రత్యామ్నాయ మార్గాలేమీ చూపలేకపోయాయన్నారు. ఒకపక్క ఆర్థికంగా నష్టపోయి ప్రజల జీవనం గడుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రోజూ పెట్రోల్ ధరలు పెంచుతుందని మండిపడ్డారు. వెంటనే ప్రజలను ఆదుకోవడానికి ప్రతి కుటుంబానికి నెలకు రూ. 7500 లు, కుటుంబంలోని ప్రతి ఒక్కరికి పది కేజీల బియ్యాన్ని ఇయ్యాలన్నారు. అదేవిధంగా, దేశంలోని కార్మిక చట్టాల సవరణను వెంటనే విరమించుకోవాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, గత మూడు నెలల కరెంటు బిల్లులను ప్రభుత్వమే భరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బీరం మల్లేశం, జయరాజా, జిల్లా కమిటీ సభ్యులు సాయిలు, యాదగిరి, యాదవ రెడ్డి, నాయకులు బాగారెడ్డి, బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.