డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేయాలి

by Shyam |
డబుల్ బెడ్ రూం ఇండ్లను  పంపిణీ చేయాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ :
నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్హులైన పేదలకు వెంటనే పంపిణీ చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు యస్.వీరయ్య డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో నాగారం ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ…లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ప్రజలకు పంపిణీ చేశామని అసెంబ్లీ లో మంత్రులు ప్రగల్బాలు పలికారనీ అన్నారు. కానీ ప్రజలకు పంపిణీ చెయ్యలేదని చెప్పడానికి నిజామాబాద్ నగరంలో నాగారం ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లే నిదర్శనమని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ‌లో రాజకీయ తాబేదార్లకు ప్రాధాన్యం కల్పించి అర్హులైన పేదలకు అందకుండా చేస్తున్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed