ప్రజలను గాలికొదిలేశారు

by Shyam |   ( Updated:2020-06-20 10:36:27.0  )
ప్రజలను గాలికొదిలేశారు
X

దిశ, ఇబ్రహీంపట్నం: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే ప్రజా వైద్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చేరుపల్లి సీతారాములు విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం శనివారం ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. దేశంలో రోజుకు 10 నుంచి 20 కరోనా కేసులు నమోదవుతున్నప్పుడు లాక్‌డౌన్ ప్రకటించి, ఇప్పుడు కేసులు పెరుగుతున్నా ప్రజలను గాలికి వదిలేశారని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అతి తక్కువ టెస్టులు చేసిన గొప్ప రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. దాదాపు రూ.29 కోట్ల వ్యయంతో గచ్చిబౌలిలో కరోనా హాస్పిటల్ కడతామని చెప్పి ఇప్పటివరకు ప్రారంభించక పోవడం చూస్తుంటే వైద్య సదుపాయాలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బి.సామెల్, పి.యాదయ్య, మధుసూదన్‌రెడ్డి, చంద్రమోహన్, రవికుమార్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story