- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో బీజేపీ.. సీపీఎం నేత సంచలన కామెంట్స్
దిశ, భద్రాచలం : అనాలోచితంగా ఆంధ్రాలో కలిపిన రాజుపేటని తిరిగి భద్రాచలంలో కలపాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎజే రమేశ్ విజ్ఞప్తి చేశారు. సీపీఎం రాజుపేట బీ శాఖ మహాసభ డి. రామకృష్ణ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో బీజేపీ పాలన నడుస్తోందని, బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నంచేసి తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.
రైతు ,కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకురావడం ద్వారా ప్రజల హక్కులను కాలరాసిందని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నిత్యవసర వస్తువులు రోజురోజుకీ విపరీతంగా పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్నారని తెలిపారు. బీజేపీ మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టి క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. శాఖ మహాసభ ప్రారంభానికి ముందు పార్టీ పతాకాన్ని పార్టీ సీనియర్ సభ్యులు కామ్రేడ్ సజ్జా రామచంద్ర రావు ఆవిష్కరించారు. ఇంకా ఈ మహాసభలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎంబీ. నర్సారెడ్డి, పార్టీ పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు బండారు శరత్ బాబు, పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ళ లీలావతి, ఎంవి. ప్రసాదరావు, పార్టీ సభ్యులు డేగల రాంబాబు, పిల్లెం లక్ష్మీకాంత, నిట్ట వరలక్ష్మి, డేగల యేసు, శీలం సాయి, వినీల్ తదితరులు పాల్గొన్నారు.