- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. కల్లాల వద్ద CPI(ML) ధర్నా
దిశ, ఖమ్మం రూరల్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని అఖిలభారత రైతుకూలి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలోని కాచిరాజుగూడెం గ్రామంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో కల్లాల దగ్గర ధర్నా నిర్వహించారు. సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న మొండి వైఖరికి నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చామని, రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా యాసంగిలో వరి వేసే రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయాలని, అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు లింగయ్య, కోటయ్య, నాయకులు అప్పారావు, మోహన్ రెడ్డి, అంజయ్య, ఉపేంద్ర రావు, నాగేశ్వర రావు, వెంకటయ్య, శ్రీను, మల్లిఖర్జునరావు, లింగయ్య, ఉపేందర్, వెంకటరాములు, నాగభూషనం, బాబు తదితరులు పాల్గొన్నారు.