- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం : తమ్మినేని వీరభద్రం
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం డాక్టర్లకు రక్షణ కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కి నిరసన చేయడం డాక్టర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యనికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఈ విషయమైన బుధవారం తమ్మినేని ఓ ప్రకటన చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో డాక్టర్లు తమ విధుల్లో పూర్తిగా నిమగ్నమవుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వాంఛనీయం కాదని పేర్కొన్నారు. గతంలో కూడా రక్షణ లేదని డాక్టర్లు ఆందోళన చేపట్టారని గుర్తుచేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. రోగులకు సకాలంలో సరైన వైద్య సేవలు అందించటంలో ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ తక్షణమే జోక్యం చేసుకొని డాక్టర్లకు పూర్తి రక్షణ కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.