- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమరావతి రైతుల మహా పాదయాత్ర.. మద్దతుపై CPI కీలక ప్రకటన
దిశ, ఏపీ బ్యూరో : అమరావతి రైతుల మహా పాదయాత్రకు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ స్పష్టం చేశారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు జరిగే ఈ పాదయాత్రకు తమ పార్టీ మద్దతు ఉంటుందని వెల్లడించారు. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అనే పేరుతో మహా పాదయాత్రకు అమరావతి రైతులు నడుం బిగించారని.. అందుకు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే అమరావతి ప్రాంతంలో దాదాపు రూ.10 వేల కోట్లు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. సుదీర్ఘకాలంగా అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మహా పాదయాత్రకు అనుమతిపై డీజీపీ ఈనెల 28 లోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లు తెరవాలి. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.