- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"సాక్షాత్తూ జడ్జిపైనే దాడికి దిగితే.. సామాన్యుడి సంగతేంటీ?
దిశ, ఏపీబ్యూరో: సాక్షాత్తూ జడ్జిపైనే దాడికి తెగబడితే ఇక సామాన్య ప్రజానీకం సంగతేంటనీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. సీఎం జగన్‌కు లేఖ రాసిన ఆయన, చిత్తూరు జిల్లాలో దళిత జడ్జిపై దాడికి పాల్పడిన వైసీపీ శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో అధికార వైఎస్ఆర్సీపీ నేతల భూకబ్జాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జస్టిస్ రామకృష్ణ పై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అనుచరులు దాడి చేయడం దుర్మార్గమని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ జడ్జిపైనే దాడి చేశారంటే సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. పోలీసులు కేసు కూడా నమోదు చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోందని లేఖలో పేర్కొన్నారు. తక్షణమే దళిత జడ్జిపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా భూ కబ్జాలను అరికట్టాలని ఆయన ఈ లేఖలో కోరారు.