రైతుల పాదయాత్రను విజయవంతం చేయండి.. సీపీఐ రామకృష్ణ

by srinivas |
రైతుల పాదయాత్రను విజయవంతం చేయండి.. సీపీఐ రామకృష్ణ
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రైతుల మహాపాదయాత్రను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లాల కార్యదర్శులను పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆదేశించారు. మహాపాదయాత్ర 45 రోజులపాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా జరుగనుంది. మహాపాదయాత్ర మీమీ జిల్లాలలోకి ప్రవేశించినప్పుడు మన పార్టీ తరపున ఘనస్వాగతం పలికి, పాదయాత్రలో పాల్గొనాలని ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చారు.

పార్టీ, ప్రజా సంఘాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రకు స్వాగతం పలికి, నియోజకవర్గం వరకు తప్పక పాల్గొనాలని సూచించారు. తిరుపతిలో జరిగే బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో తమ పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాదయాత్రను జిల్లా పార్టీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధతో విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story