'కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారు'

by Shyam |
కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాను నియంత్రించడంలో సీఎం కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ఆరోపించారు. ఆస్పత్రులలో ప్రజలకు వైద్యం అందడం లేదంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు సీపీఐ (ఎం) నాయకులతో కలిసి ఆయన శనివారం కోఠిలోని డీఎంహెచ్ఎస్ ముట్టడికి యత్నం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ భారీగా మోహరించిన పోలీసులు రాఘవులుతో సహా ఇతర నాయకులను లోనికి వెళ్లకుండా అడ్డుకు అరెస్టు చేశారు. అనంతరం వారిని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. తెలంగాణ ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్ చెప్పారని, ఇలాంటి ధనిక రాష్ట్రంలో ప్రజలకు వైద్యం సరిగా ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. కోవిడ్ ను అరికట్టకుండా ప్రభుత్వం డంబాచారం, ప్రగల్బాలు పలుకుతోందని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతులపై పెరిగిన డీజిల్ ధరలు ప్రభావం చూపుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి తెచ్చి ప్రతి కుటుంబానికి రూ 7500 ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed