విగ్రహాలు ధ్వంసం చేసింది వాళ్లే : సీపీఐ నారాయణ

by Anukaran |
విగ్రహాలు ధ్వంసం చేసింది వాళ్లే : సీపీఐ నారాయణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో ఎస్ఈసీకి ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతున్నవిషయం తెలిసిందే. దీనిపై నారాయణ మాట్లాడుతూ… ఎస్ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి ఎవరికీ అధికారం లేదని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించారు. ఈ పరిస్థితులను చూస్తుంటే ముందు ముందు రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ముమ్మాటికీ ఎలక్షన్ ప్రక్రియ జరపాల్సిందే అని నారాయణ అభిప్రాయపడ్డారు. విగ్రహాలను పూజించే వారే విధ్వంసానికి పాల్పడుతున్నారని అన్నారు. అన్నీ తెలిసి కూడా అధికార విపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. అసలు దోషులను శిక్షించకుండా జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed