- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోడు భూములకు పట్టాలివ్వకుంటే ఉద్యమాలే : సీపీఐ నారాయణ
దిశ, డిండి: పోడు భూములకు పట్టాలు ఇవ్వకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. పోడు భూముల పట్టాల సాధన కోసం మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం హాజీపూర్ వద్ద చేపట్టిన ధర్నాకు వెళ్తూ మార్గమధ్యలో డిండి మండల కేంద్రంలో కాసేపు ఆగారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 2006 అటవీ చట్టం అద్భుతమని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు అటవీ భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. ఆదివాసీలు ఏమీ చేయలేరని కేసీఆర్ ఇష్టారాజ్యంగా అణగ తొక్కుతున్నారని, ఆదివాసీల ఇండ్ల కింద ఉన్న ఖజానాను కార్పొరేట్‌లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హరితహారం పేరుతో గిరిజనుల భూములు లాక్కుంటున్నారని, ఆదివాసీల భూముల్లోనే హరితహారం చేపట్టాలా.. వేరే భూముల్లో చేయకూడదా అని ప్రశ్నించారు. ఆయన వెంట సీపీఐ నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి బాలనరసింహ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భవాణి, మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు.