వైద్యానికి కేటాయింపులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి

by Shyam |
వైద్యానికి కేటాయింపులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైద్యానికి కేటాయించిన నిధులపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకటన రిలీజ్ చేశారు. జీడీపీలో 1.9శాతం వైద్యానికి కేటాయింపులు పోల్చుకుంటే పేద దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్ కంటే తక్కువేనన్నారు. ప్రతి సామాజిక సమస్యను ఎన్నికల ఒరవడితో మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్… కరోనాను పట్టించుకోకుండా మూడు రాజధానుల అంశం, ఎన్నికల కమిషనర్‌ను తొలగింపు అంశాలపైనే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారని అన్నారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కరోనా రోగులు ఎంతమంది చనిపోయారో చెప్పలేక పోతున్నారని విమర్శించారు.

Advertisement

Next Story