రాందేవ్ బాబాను అరెస్టు చేయాలి: నారాయణ

by Shyam |
రాందేవ్ బాబాను అరెస్టు చేయాలి: నారాయణ
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్‌కు మందు కనిపెట్టామని చీటింగ్ చేసిన రాందేవ్‌బాబాను అరెస్టు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన చేశారు. ఇంతవరకు డబ్ల్యూహెచ్‌వో, శాస్త్రవేత్తలు కరోనాకు మందు కనిపెట్టలేదని చెబుతున్నారని నారాయణ తెలిపారు.

యోగా చేసుకునే రాందేవ్ బాబా కరోనాకు మందులు కనిపెట్టామని ప్రజలను చీటింగ్ చేసే ప్రయత్నం చేశాడని విమర్శించారు. ప్రభుత్వం కేసు నమోదు చేసి రాందేవ్ బాబాను అరెస్టు చేయాలని, పతాంజలి సంస్థను మూసివేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story