జగన్ ఏపీలో పులి.. ఢిల్లీలో పిల్లి : సీపీఐ నారాయణ

by srinivas |
జగన్ ఏపీలో పులి.. ఢిల్లీలో పిల్లి : సీపీఐ నారాయణ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏపీలో వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొని మాట్లాడుతూ… ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు అన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్ కంపెనీల కొమ్ము కాస్తున్నాడని మండిపడ్డారు. అంతేగాకుండా మత విద్వేశాలు రెచ్చగొట్టి బీజేపీ ఏపీలో పాగా వేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఏపీలో పులి.. ఢిల్లీలో పిల్లి అని నారాయణ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story