ఓయూ భూములను రక్షించాలి !

by Shyam |

దిశ, హైదరాబాద్: తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఉస్మానియా యూనివర్శిటీ భూముల కబ్జాకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం. శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఓయూ భూములను సీపీఐ(ఎం) బృందం సందర్శించింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే 64ఎకరాలకు పైగా యూనివర్శిటీ భూములు ఆక్రమణలకు గురైనట్టు అధికారికంగా చెబుతున్నా అంతకంటే ఎక్కువే కబ్జాల పాలైందని ఆరోపించారు. తప్పుడు డాక్యుమెంట్లతో 3,287 చదరపు గజాల స్థలాన్ని కబ్జా చేయడం దుర్మార్గమని, అందులో ఒకరు హైకోర్టు రిటైర్డ్ జడ్జి 311 చదరపు గజాలల్లో నిర్మాణం ప్రారంభించడం సిగ్గు చేటన్నారు.

Advertisement

Next Story

Most Viewed